: అప్పు తిరిగివ్వమంటే కిడ్నాప్ చేశారు
ఇద్దరు కిడ్నాపర్లను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కీసర అంబేద్కర్ నగర్ కు చెందిన ఫైనాన్సర్ రాజు దగ్గర అదే ప్రాంతానికి చెందిన రవి అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమని ఫైనాన్సర్ రాజు అడిగాడు. దీంతో ఆగ్రహించిన రవి స్నేహితులతో కలిసి రాజును కిడ్నాప్ చేశాడు. సుమోలో తీసుకెళుతుండగా రాజు ఎలాగోలా తప్పించుకుని పోలీసులకు విషయం చెప్పడంతో వారు ఇద్దరు కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు.