: భారత్ పై దాడికే విమానం హైజాక్... న్యూయార్క్ టైమ్స్


కొన్ని రోజుల క్రితం అదృశ్యమైపోయిన మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానంపై ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. భారత్ పై దాడి చేసేందుకే టెర్రరిస్టులు విమానాన్ని హైజాక్ చేశారని తెలిపింది. 9/11 దాడుల మాదిరిగా భారత్ పై విమాన దాడులకు ఆల్ ఖైదా ప్రణాళిక రచించిందని వెల్లడించింది. గతంలో అమెరికా విదేశాంగ శాఖలో పనిచేసిన స్ట్రోబ్ టాల్బోట్ కూడా ఇదే విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు. భారత నగరంపై 9/11 తరహాలో దాడిచేసేందుకు హైజాకర్లు కుట్ర పన్ని ఉంటారని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News