: హైదరాబాదులో సాయంత్రం ‘మోడీ ఫర్ పీఎం’ కార్యక్రమం
హైదరాబాదులో ఇవాళ (ఆదివారం) సాయంత్రం 5.30 గంటలకు ‘మోడీ ఫర్ పీఎం’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో హోటల్ మారియట్ లో జరుగుతోన్న ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ నేత ముప్పవరపు వెంకయ్య నాయుడు పాల్గొంటున్నారు. ‘మోడీని ప్రధానిని చేద్దాం’ అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.