: సిద్ధమవుతున్న రామయ్య పెళ్లి తలంబ్రాలు


ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణ వైభవం అప్పుడే ప్రారంభమైంది. వేదపండితులు స్వామి ముత్యాల తలంబ్రాలను కలిపే పనులను ఈ రోజు మొదలుపెట్టారు. చిత్రకూట మండపంలో ఇవి జరుగుతున్నాయి. ఈ విశేషాన్ని పురస్కరించుకుని భక్తులు భారీ సంఖ్యలో రామయ్య దర్శనం కోసం తరలివచ్చారు. రామనామస్మరణలతో భద్రగిరి మార్మోగింది. కల్యాణ మంటపంపై చలువ పందిళ్లు కప్పడం, ఇతర పనులు కూడా జరుగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు స్వామి, అమ్మవార్లకు డోలోత్సవం జరగనుంది.

  • Loading...

More Telugu News