: నేటి సాయంత్రం బాబ్లీపై అఖిలపక్ష భేటి
బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు నేపథ్యంలో ఈ సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష భేటి జరగనుంది. బాబ్లీపై కోర్టు తీర్పుకు ప్రభుత్వ అసమర్ధతే కారణమంటూ విపక్షాలు శాసనసభ సమావేశాల్లో విమర్శించాయి. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన ప్రభుత్వం పార్టీలతో చర్చించి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని సభలో హామీ ఇచ్చింది.
ఈ క్రమంలో సచివాలయంలో నేడు అఖిలపక్ష భేటి నిర్వహిస్తోంది. బాబ్లీపై మళ్లీ పునః సమీక్ష పిటిషన్ వేయాలని విపక్షాలు ఈ భేటీలో డిమాండు చేయనున్నాయని తెలుస్తోంది.
ఈ క్రమంలో సచివాలయంలో నేడు అఖిలపక్ష భేటి నిర్వహిస్తోంది. బాబ్లీపై మళ్లీ పునః సమీక్ష పిటిషన్ వేయాలని విపక్షాలు ఈ భేటీలో డిమాండు చేయనున్నాయని తెలుస్తోంది.