: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కేసీఆర్ పాలేరులే: అరవింద్ రెడ్డి


టీఆర్ఎస్ నేత ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చిన సందర్భంలో కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హిట్లర్ లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కేసీఆర్ కింద పాలేరులే అని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసమే ఇంత కాలం దొరల కింద పాలేరులా బతికామని స్పష్టం చేశారు. కేవలం పదవుల కోసమే దివాకర్ రావు కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చింది కాబట్టే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. తనతో పాటు కాంగ్రెస్ లోకి వస్తామన్న మరికొంత మంది టీఆర్ఎస్ నేతలు కూడా తమ మాటపై నిలబడాలని సూచించారు.

  • Loading...

More Telugu News