: సర్వేలతో తెలుగు వారిని ఎన్డీటీవీ మోసం చేస్తోంది: పయ్యావుల
లోక్ సభ ఎన్నికలపై ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో సీమాంధ్రలో వైఎస్సార్సీపీ 15 సీట్లు గెలుచుకుంటుందని, అత్యధికంగా 43 శాతం ఓట్లు రాబట్టుకుంటుందని పేర్కొంది. ఇదే క్రమంలో టీడీపీ-బీజేపీ కూటమికి 9 సీట్లు వస్తాయంది. దీనిపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఎన్డీటీవీ సర్వేకు విశ్వసనీయత లేదన్నారు. జగన్ సొంత ఆస్తులపై ఊసెత్తని ఎన్డీటీవీ.. సర్వేల పేరుతో తెలుగు ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. జగన్ సొంత మీడియా సాక్షికి, ఎన్డీటీవీతో వ్యాపార భాగస్వామ్యం ఉందని ఆరోపించారు.