: దేశీయ మార్కెట్లో గూగుల్ నెక్సస్ 7 టాబ్లెట్


టెక్నాలజీ దిగ్గజం గూగుల్ నుంచి వెలువడిన తొలి ఎలక్ర్టానిక్ పరికరం నెక్సస్ 7 టాబ్లెట్ నేటి నుంచి భారతీయులకు అందుబాటులోకి వచ్చింది. ఈ టాబ్లెట్ ను గూగుల్ పోయిన ఏడాదే అమెరికాలో విడుదల చేయగా.. తాజాగా భారతీయ మార్కెట్ లోనూ విక్రయాలు ప్రారంభించింది.

దేశంలోని గూగుల్ స్టోర్లలో ఇది లభిస్తుంది. దీని ధర 15,999 రూపాయలు. ఆన్ లైన్లో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ టాబ్లెట్ కోసం ముందస్తు ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ 5 నుంచీ టాబ్లెట్లు వినియోగదారులకు అందుతాయి. 

ఇటీవలే భారత్ కు వచ్చిన సందర్భంగా నెక్సస్ ను ఇక్కడి మార్కెట్ లోకి తీసుకురావడంలో జరిగిన ఆలస్యానికి క్షమించాలని గూగుల్ చైర్మన్ ఎరిక్ కోరారు. అనంతరం చాలా తక్కువ వ్యవధిలోనే గూగుల్ నెక్సస్ ను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. నెక్సస్ 7 టాబ్లెట్ ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ చూరగొంది. ఆండ్రాయిడ్ ఆధారిత ఈ టాబ్లెట్ కు గూగులే నేరుగా సర్వీస్ అందివ్వడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

1.3 గిగాహెడ్జ్ సామర్థ్యంతో పనిచేసే టెగ్రా 3 క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఏడు అంగుళాల స్క్రీన్, 1జిబి ర్యామ్, 1.2 మెగాపిక్సెల్ కెమెరా తదితర సదుపాయాలున్నాయి. అయితే ప్రస్తుతం గూగుల్ దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చిన నెక్సస్ టాబ్లెట్లు 3జి సపోర్టెడ్ కావు. కేవలం వైఫై ఆధారంగా పనిచేసేవి. 3జి సపోర్టెడ్ టాబ్లెట్లు తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది. 

  • Loading...

More Telugu News