: పవన్ కల్యాణ్ రెండు గంటల సినిమా చూపించాడు: షబ్బీర్ అలీ
పవన్ కల్యాణ్ రెండు గంటల పాటు సినిమా చూపించాడని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. అతని వ్యక్తిగత జీవితం జోలికి వెళ్లమని చెబుతూనే... అతని వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారు. హైదరాబాదులో షబ్బీర్ అలీ మాట్లాడుతూ, గతంలో పవన్ కల్యాణ్ సహజీవనం చేస్తున్నప్పుడు రేణుదేశాయ్ తండ్రి తన వద్దకు వచ్చాడని, అప్పుడు పవన్ కల్యాణ్ ను పెళ్లి చేసుకోవాలని సూచించానని అన్నారు.
ఇప్పుడు ఆమెను కూడా వదిలేశారని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ కు మానసిక ప్రశాంతత లేదని అన్నాడు. పవన్ కల్యాణ్ లాంటి జోకర్లు ఎంతో మంది వచ్చి వెళ్లిపోయారని ఆయన అన్నారు. పవన్ మద్దతు ఎవరు అడిగారని షబ్బీర్ అలీ ప్రశ్నించారు.