: నోరు జారి నాలుక్కరుచుకున్న ఆఫ్రిదీ


పాకిస్థానీ మహిళలు క్రికెట్ ఆడగలరా? ఈ ప్రశ్న ఒక టీవీ ఇంటర్వ్యూ సందర్భంగా పాక్ క్రికెటర్ ఆఫ్రిదీని అడిగినది. అందుకు ఆయన ఏం చెప్పారంటే.. 'మన ఆడవాళ్ల చేతుల్లో మంచి రుచి దాగుంది. వారు చాలా రుచికరంగా వండగలరు' అంటూ బదులిచ్చారు. ఇప్పుడు దీనిపై పాక్ లో పెద్ద దుమారం రేగుతోంది. మహిళలను అవమానించేలా ఆయన మాట్లాడారంటూ విమర్శలు వచ్చి పడుతున్నాయి. దీంతో ఆఫ్రిదీ స్పందించాడు. 'నేను చెప్పిన మాటల నుంచి తప్పుడు అర్థం తీశారు. నా ప్రతిభను చూసి గిట్టని వాళ్లు చేస్తున్న పనే ఇది. ఐదున్నర నెలల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలోని కొంత భాగాన్నే బయటపెట్టడం వెనుక నన్ను అప్రతిష్ట పాల్జేయాలనే కుట్ర దాగుంది' అని అన్నారు. తాను మహిళల క్రికెట్ కు గొప్ప మద్దతుదారుడినని, వారిని అడిగితే ఇదే చెబుతారని చెప్పారు.

  • Loading...

More Telugu News