: పవన్ కి రాహుల్ గురించి మాట్లాడే అర్హత లేదు... పిల్లకాకి: మల్లు
పవన్ కల్యాణ్ పిల్లకాకి లాంటి వాడని మల్లు భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అని పవన్ కల్యాణ్ పిలుపు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ఇకనైనా కలల ప్రపంచం వీడి వాస్తవ ప్రపంచంలోనికి రావాలని హితవు పలికారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి పవన్ కల్యాణ్ కు లేదని అన్నారు. పవన్ కల్యాణ్ చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడే వ్యక్తిలా ఉన్నాడని ఆయన మండిపడ్డారు. పవన్ కల్యాణ్ మతిభ్రమించి మానసిక ఒత్తిడిలో ఉన్నట్టున్నాడని ఆయన విమర్శించారు.