: పవన్ ప్రసంగం కదిలించింది: మంచు లక్ష్మి
పవన్ కల్యాణ్ ప్రసంగంపై పలువురు సినీ ప్రముఖులు తమ స్పందనలను ట్విట్టర్ లో వెల్లడిస్తున్నారు. పవన్ ప్రసంగం హృదయాన్ని తాకిందని మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. అతని ప్రసంగంలో కొన్ని చోట్ల తన తండ్రి మోహన్ బాబు భావాలు వినపడ్డాయని తెలిపింది. పవన్ కు ఆల్ ది బెస్ట్ చెప్పింది.
దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశాడు. పవన్ ప్రసంగం కోట్లాది తెలుగు ప్రజల మనోభావాలను వ్యక్తపరిచిందని అన్నాడు.