: కేజ్రీవాల్ ఓ బచ్చా: శ్రీశ్రీ రవిశంకర్
ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ రాజీకీయాల్లో కేజ్రీవాల్ ను ఓ పిల్లాడిలా పేర్కొన్నారు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. నిజాయతీపరులు తెరవెనుక ఉండిపోతే.. రాజకీయ పార్టీలు నేరస్థులనే ఎన్నికల్లో నిలబెడతాయని హెచ్చరించారు. విధాన లోపాల వల్ల దేశ పారిశ్రామిక అభివృద్ధి దారుణ స్థితిలో ఉందని, కనుక విధానాలు మారాల్సిన సమయం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.