: దిగ్విజయ్ తో నేడు సీమాంధ్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ
మూడు రోజుల పాటు రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఈ రోజు మొత్తం సీమాంధ్రపై చర్చకే కేటాయించారు. ఈ క్రమంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎన్నికల ప్రచార, ఎన్నికల ప్రణాళిక కమిటీలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఈ సమావేశానికి హాజరు కావాలంటూ ఆనం, పనబాక, డొక్కాలకు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా ఫోన్లు చేశారు. అంతే కాకుండా సీమాంధ్ర ప్రచార కమిటీ ఛైర్మన్ చిరంజీవిని స్వయంగా కలసి భేటీ గురించి వివరించారు.