: విభజన తీరు కోట్లాది మందికి కోపం తెప్పించింది: పవన్ కల్యాణ్
ఢిల్లీ పెద్దలు రాష్ట్రాన్ని విభజించిన తీరు సరిగా లేదని పవన్ కల్యాణ్ చెప్పారు. విభజన తీరు అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో కోట్లాది మందికి కోపం తెప్పించిందని ఆయన అన్నారు. సినిమాల్లో నటించే తాను తెలంగాణ ఉద్యమాన్ని పది, పన్నెండు సంవత్సరాల నుంచి మాత్రమే గమనిస్తున్నానని... అయితే నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న ఢిల్లీ పెద్దలు ఉద్యమాన్ని గురించి తెలిసీ విభజనను సరిగా చేయలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు.