: అమరవీరుడు భగత్ సింగ్ డైరీలను చదివాను: పవన్ కల్యాణ్
భగత్ సింగ్ ఆత్మ బలిదానం జరిగి చాలా కాలం అయ్యిందని, కానీ భగత్ సింగ్ మరణం తనను కదిలించిందనీ పవన్ కల్యాణ్ చెప్పారు. భగత్ సింగ్ డైరీలను చదివినప్పుడు తాను స్ఫూర్తి పొందానని పవన్ తెలిపారు. చిన్న వయస్సులోనే భగత్ సింగ్ మరణించినా, భావి తరాలకు దేశభక్తిని, స్ఫూర్తిని రగిలిస్తూనే ఉన్నారని చెప్పారు. ఆయన ఇప్పటి పాకిస్థాన్ లో, అప్పటి అఖండ భారతదేశంలో పుట్టిన విషయాన్ని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేశారు.