: బీసీలకు యాభైశాతం సీట్లు, సీఎం పదవి ఇవ్వండి: ఆర్.కృష్ణయ్య
వచ్చే ఎన్నికల్లో బీసీలకు భారీ స్థాయిలో అవకాశాలు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అడుగుతున్నారు. యాభైశాతం సీట్లు ఇవ్వడంతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి పదవి కూడా తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మధ్యాహ్నం హైదరాబాదులోని గాంధీభవన్ లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ ను కృష్ణయ్య కలిశారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను చెప్పారు. అనంతరం తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇచ్చిన విషయంపై కృతజ్ఞతలు తెలిపారు. కాగా, కృష్ణయ్య ఇచ్చిన డిమాండ్లను మేనిఫెస్టో కమిటీ చూసుకుంటుందని డిగ్గీ రాజా చెప్పారు.