: తిరుమలలో అగ్నిప్రమాదం
చిత్తూరు జిల్లాలోని పుణ్యక్షేత్రం తిరుమల కొండపైనున్న ఓ దుకాణంలో మంటలు చెలరేగాయి. తిరుమల హెచ్.టి.కాంప్లెక్సులోని ఓ షాపులో కొద్దిసేపటి క్రితం గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.