: నేటితో ముగుస్తున్న మొదటి దశ బడ్జెట్ సమావేశాలు
ఈ నెల 13న మొదలైన అసెంబ్లీ మొదటి దశ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. టీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం, రాష్ట్రంలో విద్యుత్ కోతలు, ఛార్జీలపైనే ఈ 14 రోజులు అసంపూర్తిగా చర్చలు జరిగాయి. విపక్షాల ఆందోళనలు, నిరసనల మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది. కాగా, నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారు. మరోవైపు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు సభ ఆమోదం తెలుపనుంది.