: చచ్చినవాడు బతికొచ్చాడనుకుంటే... !
రెండు వారాల క్రితం సంచలనం సృష్టించిన ఓ అమెరికా రైతు మరోసారి వార్తల్లో వ్యక్తయ్యాడు. విషయం ఏమిటంటే... మిసిసిపి ప్రాంతంలో వాల్టర్ విలియమ్స్ (78) అనే రైతు ఇటీవలే చనిపోయాడని భావించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా శవాన్ని భద్రపరిచిన సంచిలో నుంచి శబ్దాలు వచ్చాయి. తెరిచి చూడగా సదరు రైతు మహాశయుడు శ్వాస తీసుకుంటున్నట్టు గుర్తించారు. వెంటనే, బంధుమిత్రులు అందరూ చచ్చినవాడు బతికొచ్చాడంటూ సంబరాలు చేసుకున్నారు.
అయితే, ఆ ఆనందం వారికి ఎంతో కాలం మిగల్లేదు. తాజాగా వాల్టర్ మరోసారి కన్నుమూశాడు. అయితే, ఈసారి నిజంగానే. గురువారం తెల్లవారుజామున వాల్టర్ తుదిశ్వాస విడిచాడని ఆయన బంధువొకరు తెలిపారు.