: 'అన్నా' వింత వాదన
ఢిల్లీ సభకు హాజరవుతానని చెప్పి మమతా బెనర్జీకి చివరి నిమిషంలో హ్యండిచ్చిన సామాజికవేత్త అన్నా హజారే వింత వాదనతో మీడియా ముందుకు వచ్చారు. మమతా బెనర్జీకి మద్దతిస్తాను గానీ, ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు మద్దతివ్వబోనని కరాఖండీగా చెప్పేశారు. దేశంలోకెల్లా ఉత్తమ ముఖ్యమంత్రి మమతేనంటూ అన్నా నష్టనివారణ వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలోని రమిల్లా మైదాన్ లో తన పార్టీ జాతీయ అజెండాను విడుదల చేసేందుకు మమత భారీ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు అన్నా కూడా వస్తానని చెప్పడంతో ఏర్పాట్లు భారీస్థాయిలో చేశారు. అయితే, ఈ సభకు అన్నా దూరంగా ఉండడంతో సభ వెలవెలపోయింది.