: అవమానభారంతో తనను తాను కాల్చుకున్న అబల


తనకు జరిగిన అవమానాన్ని, అన్యాయాన్ని తట్టుకోలేక ఓ అమ్మాయి ఒంటికి నిప్పంటించుకుంది. పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రంలోని ముజఫర్ గఢ్ సమీపంలో 18 ఏళ్ల అమ్మాయి కళాశాల నుంచి ఇంటికి వస్తూండగా ఓ యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన జనవరి 5న చోటు చేసుకుంది.

ఆ కామాంధుడు అరెస్ట్ అయ్యాడు కానీ, తనదైన పద్ధతిలో పోలీసులను మేనేజ్ చేసేశాడు. దీంతో పోలీసులిచ్చిన నివేదిక ఆధారంగా మార్చి 13న ఆ రేపిస్టుకి బెయిల్ వచ్చింది. దీంతో, బాధిత బాలిక కుంగిపోయింది. అవమానాన్ని, అన్యాయాన్ని తట్టుకోలేక పోలీస్ స్టేషనుకు వెళ్లి దర్యాప్తు అధికారి జుల్ఫికర్ అహ్మద్ పై ఫిర్యాదు చేసింది. అనంతరం, అదే స్టేషన్ ముందు కిరోసిన్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకుంది. 80 శాతం కాలిన గాయాలతో ఆమె ఈరోజు (శుక్రవారం) ఉదయం ప్రాణాలు విడిచింది.

ఈ దారుణ ఘటన పాకిస్థాన్ దేశాన్ని కుదిపేసింది. మానవ హక్కుల కార్యకర్తలు, మహిళా సంఘాలు మండిపడ్డాయి. దీంతో, మేల్కొన్న పాక్ ప్రభుత్వం పోలీస్ అధికారి జుల్ఫికర్ అహ్మద్, మరో పోలీసు రాయ్ షహీద్ లపై సస్పెన్షన్ వేటు వేసింది.

  • Loading...

More Telugu News