: తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి డిగ్గీరాజా సూచనలు


పారిశ్రామిక అభివృద్ధి, తెలంగాణ పునర్నిర్మాణమే ప్రధాన అంశాలుగా మేనిఫెస్టో రూపొందించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు డిగ్గీరాజా సూచించారు. ఈరోజు (శుక్రవారం) ఉదయం హైదరాబాదులోని గాంధీభవన్ లో జరిగిన టి-కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశంలో ఆయన పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. మూడు రకాలుగా ప్రచారం నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలతో చర్చించాలని డిగ్గీరాజా సూచించారు. పారిశ్రామికవేత్తలు, ఫిక్కీ, ఇతర సంఘాలతో చర్చించమని కూడా ఆయన నేతలకు చెప్పారు.

ఐదారు ప్రధాన అంశాలపైనే దృష్టి సారించాలని దిగ్విజయ్ అన్నారు. చేనేత కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టాలని, ఈ నెల 22కల్లా మేనిఫెస్టోకు సంబంధించి తుది నివేదిక ఇవ్వాలని నేతలకు తెలిపారు. మేనిఫెస్టో తయారీకి సలహాలు, సూచనలపై ప్రత్యేక వెబ్ సైట్ ఏర్పాటు చేయాలని కూడా కమిటీ నిర్ణయించింది. సీమాంధ్ర, తెలంగాణ నుంచి 30 మంది స్టార్ క్యాంపెయినర్లను ఎంచుకోవాలని కూడా నిశ్చయించారు. వీరితో పాటు కొద్దిమంది జాతీయస్థాయి నేతలు కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని డిగ్గీరాజా తెలిపారు.

  • Loading...

More Telugu News