: బంగ్లాదేశ్ పయనమైన టీమిండియా
టి20 వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు టీమిండియా నేడు బంగ్లాదేశ్ పయనమైంది. ముంబయి నుంచి ఈ ఉదయం ఢాకా బయలుదేరింది. ఈ సమయంలో జట్టు వెంట కోచ్ డంకన్ ఫ్లెచర్ కనిపించలేదు. ఇటీవల కాలంలో టీమిండియా పేలవ ప్రదర్శనపై ఫ్లెచర్ ను బీసీసీఐ సంజాయిషీ కోరిన సంగతి తెలిసిందే. కాగా, మునుపెన్నడూ లేని విధంగా ఓ మేజర్ టోర్నీకి వెళుతూ కూడా భారత జట్టు మీడియా సమావేశంలో పాల్గొనలేదు. తాజా పరాజయాలు, ఐపీఎల్ ఫిక్సింగ్ వంటి అంశాలపై మీడియా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుందన్న నేపథ్యంలో బీసీసీఐ మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు విముఖత చూపింది.