: గుంటూరు జిల్లాలో రూ.4.50 కోట్లు స్వాధీనం
గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం చెక్ పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.4.50 కోట్లు పట్టుబడ్డాయి. ఆ డబ్బు రెండు జాతీయ బ్యాంకులకు సంబంధించిన నగదుగా గుర్తించారు. అయితే ఎలాంటి రక్షణ చర్యలు, రసీదులు లేకుండా వాహనాల్లో తరలిస్తుండడంతో ఆ నాలుగున్నర కోట్ల రూపాయలను నల్లపాడు పోలీసులు జప్తు చేశారు.