: పరువు దక్కించుకున్న ఇంగ్లండ్ జట్టు


కరీబియన్ దీవుల్లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పరువు దక్కించుకుంది. విండీస్ తో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లలో ఓటమిపాలై సిరీస్ చేజార్చుకున్న ఇంగ్లండ్ జట్టు... ఆఖరి టి20 పోరులో విజయం సాధించింది. బార్బడోస్ లో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఓపెనర్లు లంబ్ 63, హేల్స్ 38 పరుగులు చేశారు. చివర్లో బౌలర్ క్రిస్ జోర్డాన్ 9 బంతుల్లో నాలుగు సిక్సర్లు బాది 27 పరుగులు చేయడం విశేషం.

అనంతరం లక్ష్యఛేదనలో విండీస్ జట్టు ఓవర్లన్నీ ఆడి 7 వికెట్లకు 160 పరుగులే చేసింది. సిమ్మన్స్ 69, వికెట్ కీపర్ రామ్ దిన్ 33 పరుగులతో రాణించినా జట్టును గెలిపించలేకపోయారు. బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించిన జోర్డాన్ బౌలింగ్ లోనూ 3 వికెట్లతో సత్తా చాటాడు. రవి బొపారా రెండు కీలక వికెట్లు తీసి విండీస్ ఓటమిని కోరల్లోకి నెట్టాడు. బొపారా ధాటికి డ్వేన్ బ్రావో (16), ఆండ్రీ రస్సెల్ (0) పెవిలియన్ బాట పట్టారు.

  • Loading...

More Telugu News