: రన్ వేపై కుప్పకూలిన విమానం
విమాన ప్రమాదాలు ప్రయాణికుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్నాయి. మలేషియా విమాన ప్రమాద ఘటన మరువక ముందే... మరో పెను ప్రమాదం తృటిలో తప్పింది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలోని ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి ఫ్లోరిడా వెళ్లాల్సిన ఎయిర్ బస్ 320 విమానం టేకాఫ్ టైంలో ముందు టైర్ పేలిపోయింది. టైర్ కు సంబంధించిన తుక్కు కాస్తా ఇంజిన్ లోకి చేరడంతో భారీగా పొగ కమ్ముకుంది.
దీంతో విమానం రన్ వే పైనే కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 149 మంది ప్రయాణికులు, అయిదుగురు సిబ్బంది ఉన్నారు. నలుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలు కావడం మినహా మరేవిధమైన నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.