: తెలంగాణ అభివృద్ధికి అద్దం పట్టేలా మేనిఫెస్టో: కడియం శ్రీహరి
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా టీఆర్ఎస్ మేనిఫెస్టో ఉండాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి చెప్పారు. ప్రజల అభిప్రాయాలు, సూచనలు తెలిపేందుకు manifesto@gmail.com అనే మెయిల్ ఐడీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సూచనలు, సలహాలను ఈ మెయిల్ కు పంపవచ్చన్నారు. అంతేగాక తెలంగాణ భవన్ లో కూడా సలహాల బాక్స్ ఏర్పాటు చేసినట్లు కడియం వివరించారు. జిల్లాల వారీగా సమస్యలు, సూచనలు ఇవ్వొచ్చన్నారు. ప్రజల అజెండానే టీఆర్ఎస్ అజెండా అని మేనిఫెస్టో కమిటీ భేటీ ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.