: అవన్నీ ఆంటోనీ కమిటీ చూసుకుంటుంది: డిగ్గీరాజా
ఇతర పార్టీలతో పొత్తుల అంశాన్ని ఆంటోనీ కమిటీ చూసుకుంటుందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. బీసీల నుంచి వస్తున్న డిమాండ్లను మేనిఫెస్టో కమిటీ పరిశీలిస్తోందని డిగ్గీరాజా వెల్లడించారు.