: మహాత్మా గాంధీ హత్యకుట్రపై చలనచిత్రం


ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ వ్యక్తుల హత్యలపై ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అదే కోవలో మహాత్మా గాంధీ హత్యోదంతంపై ఓ సినిమా రూపొందుతోంది. గాంధీని హత్య చేసిన నాధూరాం గాడ్సే, అతని భాగస్వాములు కలిసి పన్నిన కుట్ర ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మనోహర్ మల్గోంకర్ రాసిన 'ద మేన్ హూ కిల్డ్ గాంధీ' అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ పుస్తకాన్ని ప్రచురించిన రోలీబుక్స్ ప్రచురుణ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. సిద్ధార్థ సేన్ గుప్తా దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో మహాత్మా గాంధీ 66వ వర్ధంతి సందర్భంగా విడుదల చేస్తారు. గాంధీ హత్యకు గురైన ఢిల్లీ లోని బిర్లా హౌస్ కి సరిగ్గా మూడో ఇంట్లోనే ఈ పుస్తక రచయిత నివాసం వుండేవారు. కాగా, ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు ఇంకా ప్రకటించలేదు.  

  • Loading...

More Telugu News