: గట్టిగా హత్తుకున్నా... ఆ స్పర్శ మర్చిపోలేను!: ఇలియానా


గోవా భామ ఇలియానా నటించిన మూడో బాలీవుడ్ సినిమా మై తేరా హీరో సినిమా వచ్చే నెల విడుదల కానుంది. ఈ సినిమాలో సహనటుడు వరుణ్ ధావన్ తో ఇలియానా గాఢచుంబనం ఫోటో బయటకు వచ్చింది. ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ ఇదే. తనకు నచ్చిన ఓ మంచి సంఘటన గురించి ఇలియానాను అడిగితే ఆమె చెప్పిన సంగతి ఇది. ఒక్కోసారి చిన్న చిన్న విషయాలు తనకు భలే సంతోషం కలిగిస్తాయని ఇలియానా సెలవిచ్చింది.

అవి గుర్తుకొచ్చిన ప్రతి సందర్భంలోనూ మనసు మధురానుభూతుల్లో తేలియాడుతుందని నాజూకు నడుము సుందరి తెలిపింది. ఈ మధ్య తన మూడేళ్ల మేనల్లుడిని గట్టిగా హత్తుకుందట, ఆ చిన్నారి స్పర్శ మరపురాని అనుభూతిని మిగిల్చిందని, ఆ స్పర్శ తాలూకు అనుభూతిని తానెప్పుడూ మర్చిపోలేనని ఇల్లీ బేబీ తెలిపింది.

  • Loading...

More Telugu News