: పవన్ కల్యాణ్ పార్టీని పొత్తుకు ఆహ్వానిస్తున్నాం: రాఘవులు
ప్రజా సమస్యలు పరిష్కరించడానికి పవన్ కల్యాణ్ పార్టీ పెడితే పొత్తుకు ఆహ్వానిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు తెలిపారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో వామపక్ష పార్టీలు కలిసి పని చేయడానికి సిద్ధమయ్యాయని అన్నారు. వామపక్ష పార్టీలు టీఆర్ఎస్ తో కానీ, ఇతర పార్టీలతో కానీ పొత్తులు పెట్టుకోవడానికి లోతుగా చర్చలు సాగుతున్నాయని ఆయన వెల్లడించారు.