: మా కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయడం లేదు: మంచు లక్ష్మి
తమ కుటుంబం నుంచి వచ్చే ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయడం లేదని నటి మంచు లక్ష్మి వెల్లడించారు. పోటీ చేస్తే బహిరంగంగా ప్రకటిస్తామని తెలిపారు. ఇదే సమయంలో నటుడు పవన్ కల్యాణ్ కొత్త పార్టీ, రాజకీయ రంగ ప్రవేశంపై స్పందించిన లక్ష్మి, పవన్ కు తన మద్దతు తెలుపుతున్నానని, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. ప్రజల కోసం పనిచేసే వారికే తన మద్దతు ఉంటుందని చెప్పారు.