: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఇంతేమరి..
మద్యం తాగి వాహనాలు నడపొద్దు మొర్రో.. అది మీ ప్రాణాలను హరించడమేకాదు.. ఇతరుల కుటుంబాలను సైతం రోడ్డున పడేస్తుందని సర్కారు ఎంతగా మొత్తుకున్నా కొందరు పెడచెవిన పెట్టేస్తున్నారు. ఇలా తాగి డ్రైవ్ చేసిన 11 మందికి మూడు రోజుల జైలుశిక్ష విధిస్తూ ఇవాళ కోర్టు తీర్పునిచ్చింది. రాజధాని నగరంలోని చార్మినార్, మలక్ పేట, మీర్ చౌక్, ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఈ ప్రబుద్దులు పట్టుబడి జైలు పాలయ్యారు.