: కళాశాలల్లో ఉచిత 'వై ఫై'ను ఏర్పాటు చేస్తాం: చంద్రబాబు
మున్సి‘పోల్స్’కు సంబందించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టో వివరాలను చంద్రబాబు తన నివాసంలో ఈ రోజు (గురువారం) మీడియా సమావేశంలో తెలిపారు. మున్సిపాలిటీలలో ప్రజలకు మినరల్ వాటర్ అందిస్తామని ఆయన చెప్పారు. మున్సిపాలిటీలలో సోలార్ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తమ హయాంలో మున్సిపాలిటీల్లో రోడ్లను శుభ్రంగా ఉంచామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉద్యోగ, ఉపాధి కల్పన అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు... ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని బాబు హామీ ఇచ్చారు. కళాశాలల్లో చదివే విద్యార్థుల సౌకర్యార్థం ఉచిత 'వై ఫై'ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు.