: ఎన్నికల కోడ్ కు గవర్నర్ అతీతుడు కాదు: డిప్యూటీ ఈసీ
ఎన్నికల కోడ్ కు గవర్నర్ కూడా అతీతుడు కాదని, అతనికి కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుందని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ వినోద్ జస్టి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలపై గవర్నర్ సమీక్షలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షలు నిర్వహించడం ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపారు.
అత్యవసర, ప్రత్యేక పరిస్థితుల్లో ఈసీ అనుమతితో సంబంధిత అధికారులతో మాత్రమే సమీక్ష నిర్వహించవచ్చని ఆయన చెప్పారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. కొత్త పార్టీల రిజిస్ట్రేషన్ కు పెద్దగా సమయం తీసుకోదని, నిబంధనల ప్రకారం దరఖాస్తు చేస్తే కొద్ది సమయంలోనే పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని ఆయన వెల్లడించారు.