: 10 కోట్ల రూపాయలకు శఠగోపం పెట్టిన బుల్లితెర నటి


హైదరాబాదులో ఓ టీవీ ఆర్టిస్టు 10 కోట్ల రూపాయలకు శఠగోపం పెట్టింది. జూనియర్ ఆర్టిస్టుల వద్ద చిట్టీల పేరిట సుమారు 10 కోట్ల రూపాయలు వసూలు చేసి బిచాణా ఎత్తేసింది. టీవీ ఆర్టిస్టు విజయరాణి నమ్మకంగా చిట్టీల వ్యాపారం నిర్వహించింది. సమయానికి డబ్బులు ఇచ్చేసేది. చాలా కాలంగా నమ్మకంగా ఉండడంతో జూనియర్ ఆర్టిస్టులు పెద్ద సంఖ్యలో ఆమె వద్ద చిట్టీలు వేసేవారు.

10 కోట్ల రూపాయలు జమ కావడంతో అదను చూసుకుని విజయరాణి పరారైంది. దీంతో జూనియర్ ఆర్టిస్టులు లబోదిబోమంటూ సీసీఎస్ పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విజయరాణి కోసం గాలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News