: నిజామాబాద్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడి రాజీనామా
తెలంగాణలో పుంజుకోవాలనుకుంటున్న వైఎస్సార్సీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నిజామాబాద్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్ష పదవికి డాక్టర్ మధుశేఖర్ రాజీనామా చేశారు. రానున్న ఎన్నికల్లో బాల్కొండ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేస్తానని వెల్లడించారు.