: మోడీ గుజరాత్ నుంచే పోటీ చేయాలి: బీజేపీ రాష్ట్ర శాఖ


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ అధినాయకత్వం ఈ విషయంపై ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంతో అనిశ్చితి తొలగలేదు. ఆయన వారణాసి బరిలో దిగుతారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో, బీజేపీ గుజరాత్ రాష్ట్ర శాఖ మాత్రం ఆయన సొంత రాష్ట్రంలోనే బరిలో దిగాలని ఆశిస్తోంది. దీనిపై పార్టీ ప్రతినిధి విజయ్ రూపాని మాట్లాడుతూ, బీజేపీ మద్దతుదారుల్లో అత్యధికులు మోడీ గుజరాత్ నుంచే పోటీ చేయాలని కోరుకుంటున్నారని తెలిపారు. అహ్మదాబాద్, వడోదర, రాజ్ కోట్ లలో ఏదో ఒక స్థానం నుంచి ఆయన లోక్ సభకు పోటీ చేయాలన్నది తమ ఆకాంక్ష అని రూపాని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News