: తమిళనాట ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తా: అళగిరి


తమిళనాడులో రానున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తానని డీఎంకే అధినేత పెద్ద కుమారుడు అళగిరి తెలిపారు. ఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్ ను అళగిరి కలిశారు. 2009 నుంచి 2013 వరకు కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపానని అన్నారు. డీఎంకే ఎంపీ టిక్కెట్ నిరాకరించడంతో కొత్త పార్టీ పెడతారనే వార్తలపై నిరాకరించారు. అయితే రానున్న ఎన్నికల్లో కీలక పాత్రపోషిస్తానని తెలిపారు. తన మద్దతుదారులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తానని అన్నారు. బీజేపీతో పొత్తు కోసం డీఎంకే తహతహలాడుతున్న నేపథ్యంలో అళగిరి మన్మోహన్ సింగ్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News