: పవన్ పార్టీ ఆవిర్భావ సభకు మీడియాకు ఆహ్వానాలు
నటుడు పవన్ కల్యాణ్ పెట్టబోయే కొత్త పార్టీ సమావేశానికి మీడియాకు ఆహ్వానాలు అందాయి. ఈ క్రమంలో రేపు ఉదయం మీడియా ప్రతినిధులకు ప్రత్యేక పాస్ లు జారీ చేస్తారని సమాచారం అందుతోంది. సమావేశం సమయంలో పవన్ ఒక్కరే వేదికపై ఉంటారని, రాజకీయ నేతలు గానీ, మరెవరు గానీ ఉండరని పవన్ టీమ్ తెలిపింది. ఈ సమావేశం లైవ్ కవరేజీని ఓ ప్రైవేటు ఏజెన్సీకి ఇచ్చారు. ఈ ఏజన్సీ ద్వారా అన్ని చానళ్లకు ఫీడ్ అందుతుంది.