: పవన్ ఇంకాస్త ముందు వచ్చుంటే బాగుండేది: జయసుధ
ఇంకా ముందే పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి ఉంటే బాగుండేదని సినీనటి జయసుధ అభిప్రాయపడ్డారు. చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసిన వెంటనే... పవన్ రాజకీయాల్లోకి వస్తే బాగుండేదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయాలనుకునే వారెవరైనా రాజకీయాల్లోకి రావచ్చని తెలిపారు. ఏదో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు... ఓట్లు చీల్చడానికి వస్తున్నాడు... ఇలా ఎన్నో రకాలుగా వ్యాఖ్యానిస్తుంటారని... అయితే, సేవ చేయాలనుకుంటున్నప్పుడు ఎవరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.