: 'ఈ తరం క్రికెటర్' అవార్డు రేసులో సచిన్
భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మరో విశిష్ట పురస్కారం కోసం రేసులో నిలిచాడు. 'ఈ తరం క్రికెటర్' పేరిట ఈఎస్పీఎన్ క్రికిన్ఫో వెబ్ సైట్ ఈ అవార్డును అందజేస్తోంది. ఆసీస్ లెజెండరీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్, దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్ కలిస్ కూడా సచిన్ తో పాటు తుది జాబితాలో ఉన్నారు. ఈ ముగ్గురిలో అవార్డు ఎవరిని వరిస్తుందో రేపు తేలుతుంది. ముంబయిలో శుక్రవారం జరిగే ఓ కార్యక్రమంలో విజేత పేరు వెల్లడిస్తారు. 1993 నుంచి 2013 వరకు సేవలందించిన క్రికెటర్లను ఈ అవార్డు కోసం పరిగణనలోకి తీసుకున్నారు. 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా క్రికిన్ఫో ఈ పురస్కారం ప్రదానం చేయాలని నిర్ణయించింది.