: పవన్ పార్టీకి ఈసీ గుర్తింపు కష్టమే.. ఇండిపెండెంట్లుగా ఆయన అభ్యర్థులు
పవన్ కల్యాణ్ కొత్త పార్టీ జనసేనకు ఎలక్షన్ కమిషన్ గుర్తింపు అనుమానాస్పదంగా ఉంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ బ్రహ్మ వ్యాఖ్యలు ఈ విషయాన్ని బలపరిచేలా ఉన్నాయి. పవన్ అధ్యక్షుడిగా జనశక్తి పేరుతో ఒక అప్లికేషన్ వచ్చిందని... దాన్ని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. అయితే ఏదైనా పార్టీకి గుర్తింపు లభించాలంటే... కనీసం ఆరు నెలల సమయం ఉండాలని తెలిపారు. దీంతో, రానున్న ఎన్నికల్లో పవన్ పార్టీ తరపున బరిలోకి దిగే అభ్యర్థులు ఇండిపెండెంట్లుగానే పోటీ చేయాల్సిన అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే... వీరందరికి కామన్ సింబల్ కూడా దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.