: మహిళా పైలెట్లపై పెదవి విరుస్తున్న వాయుసేన చీఫ్
అమెరికా మొదలు రష్యా వరకు, పాకిస్తాన్ నుంచి టర్కీ దాకా మహిళా పైలెట్లకు ప్రాధాన్యం కల్పించాలని భావిస్తుంటే, భారత్ తద్విరుద్ధంగా వ్యవహరిస్తోంది. చివరికి శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి చిరు దేశాలు సైతం ఈ విషయంలో మనకంటే మెరుగైన ఆలోచన ధోరణి అవలంబిస్తున్నాయి. తాజాగా, భారత వాయుసేన ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా మహిళా పైలెట్ల సామర్థ్యంపై పెదవి విరుస్తున్నారు. యుద్ధవిమానాలు నడపడం సవాల్ తో కూడుకున్న పని అని, మహిళలు పుట్టుకతోనే బలహీనులని అభిప్రాయపడ్డారు. ఎన్నో గంటలు యుద్ధరంగంలో వాయు విహారం చేయాల్సి ఉంటుందని, వారు గర్భవతో, అనారోగ్యంతోనో బాధపడుతున్నట్టయితే ఇక చెప్పనక్కర్లేదని రాహా వ్యాఖ్యానించారు.