: పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలి: కవిత
పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, ప్రజారాజ్యం పార్టీతో పవన్ కల్యాణ్ అన్న చిరంజీవి పార్టీ పెట్టి, సామాజిక తెలంగాణ అని తెలంగాణ ప్రజలకు ఆశ చూపి జై సమైక్యాంధ్ర అన్నాడని మండిపడ్డారు. పీఆర్పీ చేసిన తప్పిదానికి పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పిన తరువాతే రాజకీయాల్లోకి రావాలని ఆమె స్పష్టం చేశారు.