: కేజ్రీవాల్ ను ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ కు జరిమానా
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను ఆటోలో ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ నుంచి ముంబై పోలీసులు జరిమానా వసూలు చేశారు. కేజ్రీవాల్ నిన్న ముంబై విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి రైల్వే స్టేషన్ కు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఆ సమయంలో కేజ్రీవాల్ తో పాటు ఆటోలో పరిమితి (ముగ్గురు)కి మించి ఎక్కువ మందిని డ్రైవర్ ఎక్కించుకున్నాడు. దీంతో మోటారు వాహనాల చట్టం నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను డ్రైవర్ కు జరిమానా విధించినట్లు ముంబై అదనపు పోలీస్ కమిషనర్ ఖాలిద్ తెలిపారు. అలాగే, కేజ్రీవాల్ కాన్వాయ్ లోని ఇతర ఆటోవాలాలకు కూడా పోలీసులు ఇలానే జరిమానా విధించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.