: గవర్నరుకు ఎన్నికల కోడ్ వర్తించదన్న ఈసీ


గవర్నరుకు ఎన్నికల కోడ్ వర్తించదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాష్ట్రపతి పాలన కారణంగా రాష్ట్రంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం రద్దయి గవర్నరే ప్రభుత్వ పాలన సాగిస్తున్నారు. తన దైనందిన కార్యకలాపాల్లో భాగంగా గవర్నర్ సంయుక్త సమావేశాలను నిర్వహిస్తుండగా దీనిపై కొంత వివాదం చెలరేగింది. మీడియాలో కూడా దీనిపై భిన్న కథనాలు రావడంతో రాజ్ భవన్ అప్రమత్తమైంది.

గవర్నర్ కు ఎన్నికల కోడ్ వర్తిస్తుందా? ఆయన పర్యటనలకు, నిర్వహించే సమావేశాలకు ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందా? అని గవర్నర్ కార్యాలయం ఈసీని వివరణ కోరింది. దీనిపై ఈసీ స్పందిస్తూ... గవర్నర్ హోదాలో ఆయన ఏం చేసినా కోడ్ అడ్డంకి కాదని తేల్చి చెప్పింది. ముఖ్యమంత్రి బాధ్యతలను కూడా గవర్నర్ నిర్వహిస్తున్నందున ముఖ్యమంత్రి స్థాయిలో ఏమైనా చేపట్టాల్సి వస్తే దానికి కోడ్ వర్తిస్తుందని, ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. గవర్నర్ గా ఆయన విధుల నిర్వహణలో ఎవరూ ఎవరూ జోక్యం చేసుకోలేరని ఈసీ చెప్పింది.

  • Loading...

More Telugu News