: మలేషియా విమాన అన్వేషణలో చేయూతనిస్తాం: రాష్ట్రపతి ప్రణబ్ లేఖ
అదృశ్యమైన మలేషియా జెట్ విమానం ‘ఎంహెచ్ 370’ జాడ కనుగొనేందుకు సహాయం అందిస్తామని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మలేషియా రాజు అబ్దుల్ హలీం మౌద్దామ్ కు లేఖ రాశారు. భారత నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్వేషణకు సిద్ధంగా ఉన్నాయని ప్రణబ్ తెలిపారు. గురువారం నుంచి ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ లు... గల్ఫ్ ఆఫ్ థాయ్ లాండ్ ప్రాంతంలో కౌలాలంపూర్ విమానయాన అధికారులతో సమన్వయం చేసుకుని అన్వేషిస్తామని చేస్తాయని ఆయన తెలిపారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న భారత వైమానిక దళం, నేవీ యుద్ధ నౌకలు అన్వేషణ ప్రారంభిస్తాయని ప్రణబ్, తన లేఖలో పేర్కొన్నారు.
కనిపించకుండా పోయిన మలేషియా విమానంలో చిక్కుకున్న ప్రయాణికుల కుటుంబాలకు ప్రణబ్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ విమానంలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. అదృశ్యమైన విమానం ఆచూకీ అన్వేషణలో సహాయం చేసేందుకు అనుసరించాల్సిన విధి విధానాల రూపకల్పనలో కేంద్ర విదేశాంగ శాఖ నిమగ్నమై ఉంది.