: నువ్వు రైలు ఎక్కవద్దు...పాస్ పోర్టు స్వాధీనం చెయ్


చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అన్నారు పెద్దలు. ఆస్ట్రేలియాలో ఓ ఎన్నారైకి అలాంటి అనుభవమే ఎదురైంది. ఆస్ట్రేలియాలో నివాసముండే అజయ్ చోప్రా అనే భారతీయుడు రైలులో ప్రయాణిస్తూ తన హస్తసాముద్రిక తెలివితేటలు చూపిస్తూ ఉండేవాడు. పనిలోపనిగా చేయిచూస్తూ రైళ్లోని మహిళలతో అసభ్యంగా ప్రవర్తించి తన శునకానందాన్ని తీర్చుకునేవాడు. దీంతో అక్కడి రైల్వే పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో వారు అతడిని మెల్ బోర్న్ కోర్టు ముందు హాజరుపరిచారు.

2011లో ఐదుగురితో వెకిలిగా ప్రవర్తించానని, ఓ ఇద్దరిపై అత్యాచారయత్నం చేశానని అజయ్ చోప్రా ఒప్పుకున్నాడు. దీంతో పాస్ పోర్టు స్వాధీనం చేయాలని, వారానికి రెండు సార్లు పోలీస్ స్టేషన్ లో సంతకాలు పెట్టాలని, అస్ట్రేలియా విడిచి వెల్లకూడదని జడ్జి గెరార్డ్ ముల్లే ఆదేశించారు. మరో వైపు బెండిగో, మెల్ బోర్న్ స్టేషన్ల మధ్య రైలు ఎక్కవద్దని అజయ్ చోప్రాను రైల్వే అధికారులు ఆదేశించారు.

  • Loading...

More Telugu News